'అవగాహనతో కూడిన నాయకత్వం' పై వెబినార్ నిర్వహించనున్న BAPS యూఏఈ

- June 03, 2021 , by Maagulf
\'అవగాహనతో కూడిన నాయకత్వం\' పై వెబినార్ నిర్వహించనున్న BAPS యూఏఈ

అబుధాబి: ‘అవగాహనతో కూడిన నాయకత్వం’ అనే అంశంపై బిఎపిఎస్ హిందు మందిర్ అబుధాబిలో వెబినార్ నిర్వహించనుంది. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఎలా వస్తాయన్నదానిపై పూజ్య బ్రహ్మ విహారి స్వామి - బిఎపిఎస్ హిందు మందిర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా నాయకత్వ లక్షణాల్ని పుణికిపుచ్చుకోవడం, సమాజం పట్ల బాధ్యతగా మెలగడం గురించి ఈ వెబినార్ ద్వారా తెలియజేస్తారు. పూజ్య బ్రహ్మవిహారి స్వామి 1981లో ఆధ్మాత్మిక భావనలోకి వచ్చారనీ, ఆయన వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆధ్మాత్మికత పట్ల అందరిలోనూ అవగాహన పెంచేందుకు ప్రయత్నించారని నిర్వాహకులు పేర్కొన్నారు. వివిధ రకాలైన మతాలు, వ్యాపారాలతో ఎలాంటి వివాదాల్లేకుండా, అందరితో కలిసి మెలగడంపై బిఎపిఎస్ సంస్థ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ‘వెబినార్’లో వర్చువల్ విధానం దర్వారా పాల్గొంటారు. జూన్ 5 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 6.15 నిమిషాల వరకు (జి.ఎస్.టి. సమయం) ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూర్తి వివరాల కోసం https://webinar.mandir.ae అనే వెబ్ సైట్ సందర్శించవచ్చు. విశాల్ పటేల్: +971552998137 నెంబర్ ద్వారా సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com