క‌న్న‌డ వాసులకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సెర్చ్ ఇంజ‌న్‌…

- June 04, 2021 , by Maagulf
క‌న్న‌డ వాసులకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సెర్చ్ ఇంజ‌న్‌…

భార‌త్‌లో అత్యంత చెడ్డ‌భాష ఏంటి అని గూగుల్‌లో టైప్‌చేస్తే సెర్చ్ ఇంజ‌న్ క‌న్న‌డ అని చూపించ‌డంపై క‌న్న‌డ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.క‌న్న‌డ భాష పురాత‌న‌మైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉంద‌ని,అలాంటి ప్రాచీన భాష‌ను చెడ్డ‌భాష‌గా చూపించ‌డం త‌గ‌ద‌ని,దీనిపై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని క‌ర్నాట‌క సాంస్కృతిక శాఖ మంత్రి అర‌వింద లింబావ‌ళి పేర్కొన్నారు.సెర్చ్ ఇంజ‌న్ గూగుల్‌కు నోటీసులు జారీ చేస్తామ‌ని కన్న‌డ అధికారులు చెబుతున్నారు.సామాన్యుల నుంచి కన్న‌డ స్టార్స్ వ‌ర‌కు గూగుల్ త‌ప్పిదంపై మండిప‌డుతున్నారు.వెంటనే గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.జరిగిన పొర‌పాటును గుర్తించిన గూగుల్ వెంట‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.  కావాల‌ని చేసింది కాద‌నీ,సెర్చ్ ఇంజ‌న్ పొర‌పాటుగా గుర్తించాల‌ని, క‌న్న‌డ భాష‌లోనే గూగుల్ ట్వీట్ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com