రెస్టారెంట్లలో డైనింగ్ గైడ్ లైన్స్ ను సవరించిన అబుధాబి
- June 05, 2021
అబుధాబి: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో రెస్టారెంట్లు, కేఫ్ లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది అబుధాబి.ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రెస్టారెంట్, కేఫ్ లకు వెళ్లినప్పుడు ఒక టేబుల్ పై పరిమిత సంఖ్యను పాటించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి సేమ్ ఫ్యామిలీకి చెందిన వాళ్లైతే ఒక టేబుల్ పై ఎంతమందికైనా డైనింగ్ సర్వీస్ అందించవచ్చు. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. మహమ్మారి వైరస్ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా రెస్టారెంట్లు, కేఫ్ లలో టేబుల్ పరిమితి ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అయితే..రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యం అనుమతి ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …