కార్మిక చట్టాలపై అవగాహనకు లేబర్ కాలుక్యులేటర్ ప్రారంభం

- June 05, 2021 , by Maagulf
కార్మిక చట్టాలపై అవగాహనకు లేబర్ కాలుక్యులేటర్ ప్రారంభం

సౌదీ: కార్మిక చట్టాలపై అవగాహన లేకపోవటం,వేతన బకాయిల వివరాలు తెలియక ఇబ్బందులు పడే కార్మికుల కోసం సౌదీ న్యాయ మంత్రిత్వ శాఖ సరికొత్త సేవ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్మిక చట్టాల నిబంధనలకు అనుగుణంగా సత్వర న్యాయం చేకూరేలా 'లేబర్ కాలుక్యులేటర్' సేవలను ప్రారంభించింది.పూర్తిగా ఈ-సర్వీస్ ద్వారా సేవలు అందించే లేబర్ కాలుక్యులేటర్ ద్వారా కార్మిక చట్టాలపై అవగాహణ పెంచటంతో పాటు వేగంగా బకాయి వేతనాల చెల్లింపులు జరిగేందుకు ఆస్కారం ఇవ్వటమే కాకుండా లేబర్ కోర్టు విధానాల అమలును వేగవంతం చేసేందుకు దోహదపడుతుంది. కార్మిక చట్టాల్లోని ప్రధానమైన బకాయి వేతనాలు, వెకేషన్ పే, సర్వీస్ తర్వాత అందించే బెన్ఫిట్స్, ఒమర్ టైంతో పాటు అర్ధాంతరంగా కార్మికుడిని తొలిగించిన పక్షంలో అందించాల్సిన పరిహారం వివరాలను లేబర్ కాలుక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా అర్ధం అయ్యేలా కార్మిక చట్టంలోని అతి ముఖ్యమైన సెక్షన్లు అన్నింటిని ఒకే పేజీలో సమగ్రంగా పొందుపరిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వివరించింది. దీంతో అవసరమైతే లేబర్ కాలుక్యులేటర్ ఫలితాలను
ప్రింట్ తీసుకునేందుకు కూడా సౌకర్యంగా ఉంటుంది. https://www.moj.gov.sa/ar/eServices/Pages/Details.aspx?itemId=152లింక్ ద్వారా లేబర్ కాలుక్యులేటర్ సేవలను పొందవచ్చు.

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com