అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం
- June 05, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం.క్రమేపి లాక్ డౌన్ సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.మూడవ విడత కోవిడ్ విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం.మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నహెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 50 శాతం సామర్థ్యంతో మెట్రో రైలు సర్వీసులను సోమవారం నుంచి పునరుధ్దరించాలని నిర్ణయం తీసుకుంది.సోమవారం నుంచి సరి-బేసి సంఖ్యల ఆధారంగా దుకాణాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది.ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. పరిస్థితి మెరుగుపడే కొద్దీ క్రమేపి మరిన్ని సడలింపులు చేయనుంది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025