పని ప్రదేశాల్లో వెసులుబాట్లకు సంబంధించి సౌదీ కొత్త నిబంధనలు

- June 05, 2021 , by Maagulf
పని ప్రదేశాల్లో వెసులుబాట్లకు సంబంధించి సౌదీ కొత్త నిబంధనలు

సౌదీ అరేబియా: పని ప్రదేశాల్లో కొన్ని గ్రూపులకు చెందిన వ్యక్తులకు వెసులుబాట్లు లేదా మినహాయింపులకు సంబంధించి సౌదీ అరేబియా స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్‌మెంట్ ఈ నిబంధనల్ని ఖరారు చేసింది. తమ యజమానులకు ఆయా కేటగిరీలకు చెందిన వ్యక్తులు మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి వుంటుంది. 60 ఏళ్ళు వయసు పైబడినవారికి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారికి, గడచిన ఆరు నెలల్లో ఆస్తమా కారణంగా కనీసం ఒక్కసారైనా ఆసుపత్రిలో చేరినవారికి, ఇమ్యునోడిఫీషియెన్సీ మరియు ఎనీమియా (తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా)తో బాధపడుతున్నవారికి, అవయవ మార్పడి జరిగినవారికి, క్యాన్సర్ చికిత్సలో భాగంగా మందులు వాడుతున్నవారికి, 40పైన బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన ఒబెసిటీ సమస్యలతో బాధపడేవారికి, అదుపులో లేని డయాబెటిస్ వున్నవారికి, అధిక రక్తపోటు సమస్యతో గత ఆరు నెలల్లో కనీసం ఒక్కసారైనా ఆసుపత్రి పాలైనవారికి, తీవ్రమైన కిడ్నీ సమస్యలున్నవారికి ఈ మినహాయింపులు ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు, లాభాపేక్ష లేని సంస్థల్లో పనిచేస్తునవారికీ ఈ మినహాయింపు లభిస్తుంది. ప్రత్యేక అవసరాలు గలిగిన వ్యక్తులు (తమ వైకల్యం కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు పాటించలేనివారు) కూడా ఈ లిస్టులో చేర్చబడతారు. అయితే, ఈ వ్యక్తులు పూర్తి వ్యాక్సినేషన్ పొందితే ఎలాంటి సమస్యా లేకుండా పని చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com