నిబంధనలు పాటించని 27 రెస్టారెంట్లపై చర్యలు

- June 05, 2021 , by Maagulf
నిబంధనలు పాటించని 27 రెస్టారెంట్లపై చర్యలు

బహ్రెయిన్: హెల్త్ మినిస్ట్రీ, 27 రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నట్లుగా ప్రకటించింది. కోవిడ్ 19 ఉల్లంఘనల నేపథ్యంలో రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 187 రెస్టారెంట్లు మరియు కేఫ్‌లపై తనిఖీలు జరిపారు. జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు అవసరమైన చట్టపరమైన చర్యలు నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు కేఫ్‌లపై తీసుకుంటారని మినిస్ట్రీ వివరించింది. చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడిన స్టోర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com