కోవిడ్: కొత్త చికిత్సా విధానానికి కువైట్ ఆమోదం
- June 05, 2021
కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనా చికిత్స కోసం జిఎస్‌కె మరియు విర్ బయోటెక్నాలజీ రూపొందించిన సోట్రోవిమాబ్ వినియోగానికి ఆమోదం తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో దీన్ని ఆమోదించిన రెండో దేశం కువైట్. ఇది యాంటీబాడీ చికిత్స అని అధికారులు తెలిపారు. స్వల్ప, మధ్యస్థ తీవ్రత వున్న కరోనా రోగులకు ఈ వైద్య చికిత్సను అందిస్తారు. కాగా, కువైట్ 40 మిలియన్ డాలర్లను కోవాక్స్ డొనేషన్‌లో భాగంగా ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. కాగా, సోట్రోవిమాబ్ మెడిసిన్, 12 ఏళ్ళు ఆ పైబడిన వయసున్న వారికి వినియోగించవచ్చు. 60 ఏళ్ళు పైబడిన వయసున్నవారికి కూడా దీన్ని వాడొచ్చుగానీ, ఆసుపత్రిలో చేరాల్సిన స్థితిలో వున్నవారికి రికమండ్ చేయడంలేదు. ఈ మందు వాడటం ద్వారా 85 శాతం మరణాలు తగ్గించవచ్చునని క్లినికల్ పరీక్షల్లో తేలింది.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!