పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్

- June 05, 2021 , by Maagulf
పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్

మస్కట్: ఏడాదికి పైగా మూసివేయబడిన ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్, త్వరలో పునఃప్రారంభానికి సన్నద్ధమవుతోంది. స్థానిక, ప్రాంతీయ అలాగే అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చే విషయం. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ సీఈఓ ఇంజనీర్ సయీద్ అల్ షాన్‌ఫారి మాట్లాడుతూ, పునఃప్రారంభిస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ఈవెంట్ ఆర్గనైజర్లతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనుండడం చాలా ప్రత్యేకమని ఆయన అభిప్రాయపడ్డారు. అతిథులు, సందర్శకుల ఆరోగ్య భద్రత నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని ఆయన వివరించారు. శరీర ఉష్ణోగ్రతను కొలవడం, సోసల్ డిస్టెన్సింగ్ వుండేలా చూడటం వంటి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com