బాప్స్ హిందూ మందిర్ నుంచి భారత్ కు 2000 ఆక్సిజన్ సిలిండర్లు
- June 06, 2021
అబుధాబి: కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న భారత్ కు తొలి నుంచి తమ వంతు సాయం అందిస్తున్న బాప్స్ హిందూ మందిర్...లేటెస్ట్ గా మరో 2,000 ఆక్సిజన్ సిలిండర్లను సాయంగా అందించింది.అబుధాబిలోని తొలి హిందూ ఆలయమైన బాప్స్ మందిర్..భారత్ లోని పరిస్థితులు చూసి చలించిపోయింది. తమ వంతు సాయంగా ఆక్సిజన్ సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందించనున్నట్లు గత ఏప్రిల్ లోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు 132 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, 2,000 ఆక్సిజన్ సిలిండర్లు, 1,000 ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందించినట్లు బాప్స్ హిందూ మందిర్ ప్రతినిధులు వెబినార్ ద్వారా వెల్లడించారు. యూఏఈ, భారత్ లోని తమ వాలంటీర్లు సహాయ కార్యక్రమాలను, వైద్య పరికరాల అందజేయటం విషయంలో సమన్వయం చేసుకుంటూ సేవలు అందిస్తున్నారు. భారత్ లోని 235 ఆస్పత్రులతో పాటు తమ సేవా కేంద్రాల ద్వారా బాప్స్ హిందూ మందిర్ ప్రజలకు సేవలు అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటోంది. ప్రతి వారం ఓ గొలుసుకట్టు విధానంలో విడతల వారీగా 235 ఆస్పత్రులకు ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు అందిస్తూ కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొవటంలో భారత్ కు తమ వంతు సాయం అందిస్తోంది.అలాగే బాప్స్ స్వామినారయణ్ సంస్థ తమ సేవా కేంద్రాల ద్వారా అన్నదానం, బ్లాంకెట్లు, వైద్య పరికరాల పంపిణీ కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







