హజ్ యాత్ర పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు:కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీ
- June 06, 2021
న్యూ ఢిల్లీ: ఈ సంవత్సరం జరగనున్న హజ్ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కరోనా రెండో దశ కొనసాగుతున్నందున హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ అండగా ఉంటుందన్నారు.యాత్ర గత సంవత్సరం రద్దయిందని, ఈ సంవత్సరం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో సౌదీ అరేబియా గత ఏడాది ఇతర దేశాలకు చెందిన యాత్రికులు హజ్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది. పరిమిత సంఖ్యలో దేశీయ యాత్రలకే మాత్రమే అనుమతి ఇచ్చింది.పరిమిత సంఖ్యలో యాత్రకు అనుమతి ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







