పాకిస్తాన్: ఘోర రైలు ప్రమాదంలో 30 మంది మృతి
- June 07, 2021
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలు, మిలియట్ ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. రేతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుందని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలు లాహోర్ కు వెళుతూ ఉండగా.. మిలియట్ ఎక్స్ప్రెస్ కరాచీ నుండి సర్గోదాకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘోట్కి డిప్యూటీ కమీషనర్ ఉస్మాన్ అబ్దుల్లా మాట్లాడుతూ 'ఈ ప్రమాదంలో 30 మంది చనిపోయారని.. ఇంకో 50 మంది దాకా గాయపడ్డారని' తెలిపారు. 13 నుండి 14 బోగీల వరకూ పూర్తిగా పట్టాలు తప్పాయని... ఆరు నుండి ఎనిమిది బోగీలు.. పూర్తిగా ధ్వంసమయ్యాయని అబ్దుల్లా తెలిపారు. బోగీలలో ఇరుక్కుపోయిన ప్యాసెంజర్లను బయటకు తీస్తూ ఉన్నామని.. ఈ ఆపరేషన్ ఎంతో కష్టమైనది అన్నారు. పెద్ద పెద్ద మెషినరీని ఉపయోగించి సహాయ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఇంకా కొందరు ఇరుక్కుపోయి ఉన్నారని.. వారిని బయటకు తీస్తున్నామని అన్నారు. ఘటనా స్థలం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అలాగే గాయపడ్డ వాళ్లను సమీప ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ రేంజర్స్ సింధ్ కు చెందిన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొంది. రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు.

తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









