సైబరాబాద్ పోలీసుల రక్తదాన శిబిరం
- June 07, 2021
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బుట్ట కన్వెన్షన్ లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పర్యవేక్షించి రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిసిపి మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

రక్తం కోసం తలసేమియా బాధితులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలు అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఇప్పటివరకు 25 యూనిట్ల రక్తాన్ని సేకరించామని, ఈ రక్తదాన శిబిరం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి రక్త దానం చేయాలని చెప్పారు. రక్తదాన శిబిరం ముగిసే సమయానికి 62 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇన్స్పెక్టర్ సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో డిసిపి తోపాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, ఎస్సైలు వీరప్రసాద్ ,భాస్కర్, సుఖేందర్రెడ్డి, హారిక, మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.

తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









