ట్రావెల్ బ్యాన్ ఎత్తివేతకు సానుకూల పరిస్థితులు, ప్రవాసీయుల్లో ఊరట
- June 08, 2021
ఒమన్: సెలవులకు, ఇతర కారణాలతో ఒమన్ నుంచి సొంత దేశాలకు వెళ్లిన వారు ట్రావెల్ బ్యాన్ తో ఆయా దేశాల్లోనే చిక్కుకొని పోయారు. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో ఒమన్ పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించటంతో నెలల తరబడి వాళ్లంతా మాతృదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా చిక్కుకుపోయిన వాళ్లంతా తమ తమ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎప్పుడు ఎత్తివేస్తారో..తిరిగి ఒమన్ చేరుకొని ఎప్పుడు ఉద్యోగాల్లో చేరుతామోనని ఎదురు చూపుల్లో ఉన్నారు. అలాంటి వాళ్లందరకీ ప్రస్తుత పరిస్థితులు కొంతమేర సానుకూలంగా కనిపిస్తున్నాయి. వైరస్ తీవ్రతను బట్టి ప్రస్తుతం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, సుడాన్, ఈజిప్ట్, టాంజానియాతో సహా 15 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది ఒమన్. అయితే..కొద్ది రోజులుగా భారత్ లో కోవిడ్ పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మే మొదటి వారంలో గరిష్టంగా 4,15,000 కోవిడ్ కేసులు నమోదవగా..రాను రాను పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతూ జూన్ 7 నాటికి లక్ష లోపు నమోదయ్యాయి. అటు పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ లో కూడా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. దీంతో ట్రావెల్ బ్యాన్ దేశాల లిస్ట్ నుంచి ఆయా దేశాలకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే ఒమన్ భారత్ తో పాటు మరికొన్ని దేశాల నుంచి ప్రయాణికులను అనుమతిస్తారనే అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









