కరోనా ఉచిత వ్యాక్సినేషన్: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్...
- June 08, 2021
న్యూ ఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రతతో పాటు జనాభా ఆధారంగా ఉచితంగా కరోనా డోసులను అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సినేషన్ విషయంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ సోమవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని ప్రసంగం తర్వాత కేంద్రం ఇవాళ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.
టీకా పంపిణీలో ప్రాధాన్యత క్రమాలను కూడ కేంద్రం విధించింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన పౌరులు, రెండో డోసు వేసుకోవాల్సినవారితో పాటు 18 ఏళ్లు దాటినవారిని ప్రాధాన్యత క్రమంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రాలు స్వంతంగా నిర్ణయించుకొని టీకాలను వేయాలని కేంద్రం కోరింది. టీకా డోసులను వృధా చేస్తే కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపనుందని కేంద్రం తేల్చి చెప్పింది. జనాభా, వ్యాక్సినేషన్లలో వృద్ది, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వంటి అంశాలను ఆధారంగా చేసుకొని కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. కాల్ సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకొనే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని కూడ ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 21 నుండి ఈ గైడ్‌లైన్స్ అందుబాటులోకి రానున్నాయని కేంద్రం ప్రకటించింది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







