IIT మద్రాస్ కొత్త కోర్సులు ప్రారంభం..

- June 09, 2021 , by Maagulf
IIT మద్రాస్ కొత్త కోర్సులు ప్రారంభం..

చెన్నై: టెక్నికల్‌ కోర్సులకు డిమాండ్‌ పెరిగిపోతోంది.ఈ క్రమంలో ఐఐటీ మద్రాస్‌ కొత్త కోర్సులను ప్రారంభిస్తోంది. రాబర్ట్ బాష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఎఐ అప్లైడ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్‌లో 12 నెలల పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయి అడ్వాన్స్‌డ్ ప్రోగ్రాంను తాజాగా ప్రారంభించింది. టాలెంట్‌స్ప్రింట్ సంస్థ పార్ట్నర్‌షిప్‌తో ఈ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆగస్టులో ప్రారంభమయ్యే పీజీ ప్రోగ్రాం మొదటి బ్యాచ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కోర్సు అర్హత, అప్లికేషన్ ఫీజు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి http://iitm.talentsprint.com/adsmi/ వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఆన్‌లైన్‌లోనే దీనికి సంబంధించిన అప్లికేషన్ సమర్పించవచ్చు. వచ్చే ఏడాది నాటికి డేటా సైన్స్, డేటా ఆర్కిటెక్చర్, డేటా ఎనాలసిస్, డేటా ఇంజనీరింగ్.. వంటి కోర్సులు మెరుగైన కెరీర్ మార్గాలుగా అవతరించనున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడిస్తోంది.

అయితే 2026 నాటికి ఈ రంగాలలో 11.5 మిలియన్ల కేరీర్‌ ఓపెనింగ్స్‌ ఉంటాయని యూఎస్‌ బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాసు ప్రారంభించిన కొత్త కోర్సుకు ప్రాధాన్యం ఏర్పడింది.కోర్సులో నమోదు చేసుకునే అభ్యర్థులకు ఫ్యాకల్టీ, నిపుణులు డైరెక్ట్, ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. ఫైనాన్స్, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీస్..వంటి విభిన్న ఇండస్ట్రీ డొమైన్‌లలో అభ్యర్థులు పట్టు సాధించేలా శిక్షణ ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com