భారతీయులకు వ్యాక్సిన్ ప్రోగ్రాం చేపట్టిన ఎంబసీ

భారతీయులకు వ్యాక్సిన్ ప్రోగ్రాం చేపట్టిన ఎంబసీ

బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఉంటున్న భారత సమాజంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేలా ఇక్కడి ఇండియన్ ఎంబసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.బహ్రెయిన్ లో ఉంటున్న భారతీయులు అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ను తప్పకుండా తీసుకోవాలని పిలుపునిచ్చింది. అయితే..సరైన వీసా, పాస్ పోర్టు, సీపీఆర్ కార్డ్ లేకుండా వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నవారు, విజిట్ వీసాపై ప్రస్తుతం బహ్రెయిన్ లో ఉన్న భారతీయులకు కూడా ఎంబసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ అందించనున్నారు. అంటే సరైన గుర్తింపు కార్డులు లేని భారతీయులు కూడా https://forms.gle/pMT3v1g3o4yVgnES8 ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ పొందవచ్చు. ఇండియన్ క్లబ్, బహ్రెయిన్ కెరళీయ సమాజం-BKS, ICRF, వరల్డ్ ఎన్ఆర్ఐ కౌన్సిల్ సౌజన్యంతో ఎంబసీ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ డ్రైవ్ త్వరలోనే చేపట్టనున్నారు.18 ఏళ్లు నిండిన బహ్రెయిన్లోని భారతీయులు అంతా తమ వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. 

 

Back to Top