హైదరాబాద్ వాసులకు హెచ్చరిక..
- June 11, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో రాబోయే 3 రోజుల్లో అంటే రేపు 12, 13 మరియు 14 వ తేదీలలో హైదరాబాద్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అంతేకాదు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో జీహెచ్ ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. అత్యవసర సహాయార్ధం అన్ని శాఖల అధికారులను, మాన్సూన్ అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు.
మరోవైపు తెలంగాణ మీదుగా పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(30 నుంచి 40 కిలోమీటర్ల వేగం)తో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 12, 13 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







