షెడ్యూల్ పూర్తి చేసుకున్న `శరభ`
- March 07, 2016
సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నూతన చిత్రం 'శరభ'. యన్.నరసింహా రావ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్నారు. 20 సంవత్సరాల పాటు ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర పలు చిత్రాలకు అసోసియేట్‌గా వర్క్ చేసిన నరసింహా రావ్ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమన్ ఏమోషన్స్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజువల్ గ్రాఫిక్స్ కీలకపాత్ర వహించనుంది. రీసెంట్‌గా మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ను మార్చి 8 నుండి ఏప్రిల్ వరకు అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకోనుందని నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ తెలియజేశారు.
మైసూర్ తదితర ప్రాంతాలు, కర్ణాటక పరిసర ప్రాంతాలు సినిమా చిత్రీకరణ జరిగింది. హీరో ఆకాష్, మిస్తీలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం.రామోజీ ఫిలింసిటీలో కిరణ్ కుమార్ మన్నె భారీ సెట్ వేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తుంది. అన్నీ వర్గాలను అలరించే మంచి సినిమా అవుతుందని దర్శకుడు ఎన్.నరసింహారావ్ అన్నారు.
జయప్రద, ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







