భారతీయ విద్యార్థులకు అల్గోన్‌క్విన్ కాలేజీ స్కాలర్‌షిప్, ఫీజు డిస్కౌంట్

- June 12, 2021 , by Maagulf
భారతీయ విద్యార్థులకు అల్గోన్‌క్విన్ కాలేజీ స్కాలర్‌షిప్, ఫీజు డిస్కౌంట్

కువైట్: కువైట్‌లో తొలి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ అల్గోన్‌క్విన్ కాలేజీ, ట్యూషన్ ఫీజు తగ్గింపుని భారత కమ్యూనిటీ సభ్యులకు ప్రకటించింది 2021 ఫాల్ సెమిస్టర్ కోసం.  అలాగే అల్గోన్‌క్విన్ కాలేజీ, 3 స్కాలర్‌షిప్స్‌ని కూడా ప్రకటించింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. పలు రకాలైన డిప్లొమా కోర్సులను అల్గోన్‌క్విన్ కాలేజీ అందిస్తోంది. బిజినెస్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో కోర్సులను అందించడం జరుగుతోంది. కాగా, అర్హులైన భారత కమ్యూనిటీ దరఖాస్తులకు 20 శాతం ట్యూషన్ ఫీ డిస్కౌంట్ ఇస్తారు. 3.5 జీపీఏ సాధిస్తే  20 శాతం తర్వాతి సెమిస్టర్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇండియన్ ఎంబసీ లేదా కల్చరల్ అటాచీ ద్వారా భారత స్టూడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com