కోవిడ్ 19 సహాయ నిధి ఏర్పాటు చేసిన ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళై
- June 12, 2021
బహ్రెయిన్: ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్ళయ్ 150 మిలియన్ రూపాయలు (7.5 మిలియన్ దిర్హాములు)ని కోవిడ్ 19 సహాయ నిధి కోసం కేటాయించారు.గల్ఫ్‌కి చెందిన ఆర్.పి. గ్రూపు ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళై, కోరోనా బారిన పడ్డ మలయాళీల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. మలయాళీలు, వలసదారుల కోసం వీటిని ఖర్చు చేస్తారు.అవసరమైనవారికి వెంటనే ఆర్థిక సహాయం అందజేస్తామని రవి పిళ్ళై పేర్కొన్నారు. నరోకా రూట్స్ ద్వారా 2.5 మిలియన్ దిర్హాముల్ని పంపిణీ చేయనున్నారు. తమ కుమార్తెల పెళ్ళిళ్ళ సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి దీన్ని వినియోగిస్తారు. ఆర్.పి. ఫౌండేషన్ 5 మిలియన్ దిర్హాములను కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి అందిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







