3 రోజుల్లో 1,20,000 మందికి అస్ట్రాజెన్కా వ్యాక్సిన్
- June 13, 2021కువైట్: దేశవ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన కువైట్..గత మూడు రోజుల్లో 1,20,000 మందికి ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ అందించినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ డ్రైవ్ లో ఇప్పటికే ఆస్ట్రాజెన్‌కా తొలి డోస్ పొందిన వారికి రెండో డోస్ అందించారు. నిజానికి రష్యా నుంచి మే10న మూడో విడతగా 4 లక్షల టీకా డోసులు కువైట్ చేరుకున్నాయి. కానీ, మూడో బ్యాచ్ వ్యాక్సిన్ నాణ్యత, భద్రతకు సంబంధించి నిర్వహించిన టెస్ట్ రిపోర్టులు ఆలస్యం కావటంతో ఇన్నాళ్లుగా టీకాలను స్టోర్ రూమ్స్ లో భద్రపరిచారు. అయితే..గత బుధవారం వ్యాక్సిన్ రిపోర్టులు రావటంతో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. మూడు నెలల క్రితం ఆస్ట్రాజెన్‌కా ఫస్ట్ డోస్ తీసుకున్న రెండు లక్షల మందికి ప్రస్తుత డ్రైవ్ తో సెకండ్ డోస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ తెలిపింది. పది రోజుల్లో 30 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా లక్ష్యాన్ని అందుకుంటామని వెల్లడించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్