రెడ్ లిస్టు దేశాల వారికి వర్క్ పర్మిట్లు నిలిపివేత
- June 14, 2021
బహ్రెయిన్: భారత్ నుంచి కొత్తగా వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి షాకిచ్చింది బహ్రెయిన్.రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వర్క్ పర్మిట్ల దరఖాస్తును అనుమతించబోమని, ఆయా దేశాల వారికి కొత్త వర్క్ పర్మిట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణికులను రాకను నిషేధించిన విషయం తెలిసిందే. గత నెల 24 నుంచి ఈ మేరకు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలను కూడా రెడ్ లిస్టులో చేర్చింది. ఇక ఇప్పుడు రెడ్ లిస్టు దేశాలవారికి కొత్త వర్క్ పర్మిట్లను ఇవ్వబోమని ప్రకటించింది. అయితే..ఈ ఆదేశాలు ఇప్పటికే బహ్రెయిన్‌లో ఉన్నవారికి మాత్రం వర్తించవు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







