రస్‌ అల్‌ఖైమా, ఫుజైరాల్లో అసాధారణ వాతావరణం

- March 07, 2016 , by Maagulf
రస్‌ అల్‌ఖైమా, ఫుజైరాల్లో అసాధారణ వాతావరణం

అడ్జూటెంట్‌ జనరల్‌ రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ మేజర్‌ జనరల్‌ అలీ బిన్‌ అల్వాన్‌ అల్‌ నైమి మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పెట్రోల్‌ టీమ్స్‌ని పెంచామనీ 50 పోలీస్‌ టీమ్స్‌ పలు రోడ్లపై గస్తీ కాస్తున్నారని చెప్పారాయన. అంబులెన్సులు, రెస్క్యూ టీమ్స్‌, ఎయిర్‌ వింగ్‌ అధికారులతో సంప్రదించి అత్యవసర పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అసాధారణ వాతావరణ పరిస్థితులతో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మోటరిస్టులు పోలీసులకు సహకరించాలనీ, పూర్‌ విజిబులిటీ కారణంగా వీలైనంతవరకు రోడ్లపై ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. ఎమర్జనీ సమయాల్లో 999 లేదా 072356 600 / 072356 611 నంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఫుజారియాలో కూడా ఇవే తరహా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com