ట్రీ ప్లాంటింగ్‌ వర్క్‌షాప్‌ని ఎంజాయ్‌ చేస్తున్న షార్జా గర్ల్స్‌

- March 07, 2016 , by Maagulf
ట్రీ ప్లాంటింగ్‌ వర్క్‌షాప్‌ని ఎంజాయ్‌ చేస్తున్న షార్జా గర్ల్స్‌


షార్జా గర్ల్‌ గైడ్స్‌ (ఎస్‌జిజి) ట్రీ ప్లాంటింగ్‌ వర్క్‌షాపప్‌ని ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకం పట్ల ఆవశ్యకతను పెంచడం ఈ వర్క్‌ షాప్‌ ఉద్దేశ్యం. 'గ్రో ఎ ఘాఫ్‌' వర్క్‌ షాప్‌ ఎస్‌జిజి హెడ్‌ క్వార్టర్స్‌లో గౌమ్‌బుక్‌ అనే ఎన్‌జిఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం తప్పనిసరి అని ఈ సందర్భంగా పలువురు తఅభిప్రాయపడ్డారు. గివ్‌ ఎ ఘాఫ్‌ ట్రీ ప్లాంటింగ్‌ ప్రోగ్రామ్‌ను ఈ సందర్భంగా గౌమ్‌బుక్‌ లాంఛ్‌ చేసింది. ఘాఫ్‌ ట్రీస్‌ని పెంచి, వాటిని పంపకాల కోసం వినియోగించడం ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశ్యం. యూఏఈ మరియు గల్ఫ్‌ రీజియన్‌లో ఘాఫ్‌ ట్రీస్‌ చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. 7 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న సుమారు 100 మంది గర్ల్స్‌ అలాగే 50 మంది రిప్రెజెంటేటివ్స్‌ ప్రైవేటు ప్రభుత్వ సెక్టార్స్‌ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com