వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన తలైవా

- June 15, 2021 , by Maagulf
వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన తలైవా

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. వైద్య పరీక్షల కోసం రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో.. పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.అయితే హీరో రజనీకాంత్‌ కోరిక మేరకు.. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ వెళ్లారు. ఈ విమానంలో 14 మంది వరకూ ప్రయాణించవచ్చు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్రే మ్యాన్‌' షూటింగ్‌ కోసం రజనీకాంత్‌ అల్లుడు, హీరో ధనుష్‌ అమెరికాలోనే ఉన్నారు. ధనుష్‌ భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. వైద్యపరీక్షల కోసం రజనీకాంత్‌ అమెరికా వెళ్లారనే వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com