త్రీ స్టెప్స్ లో ఈ-ఎమిరేట్స్ ఐడీ..వివరాలు వెల్లడించిన ఐసీఏ

- June 15, 2021 , by Maagulf
త్రీ స్టెప్స్ లో ఈ-ఎమిరేట్స్  ఐడీ..వివరాలు వెల్లడించిన ఐసీఏ

యూఏఈ: మీకు యూఏఈ గుర్తింపు కార్డు హార్డ్ కాపీ అందలేదా? ప్రింట్ కాపీ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే..ఇక నుంచి ఫిజికల్ గా ఎమిరేట్స్ ఐడీ కార్డు లేకున్నా చింతించాల్సిన అవసరం లేదు.ఈ-ఎమిరేట్స్ ఐడీ కార్డు సర్వీస్ తో అందరికీ ఎమిరేట్స్ గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఐసీఏ యాప్ ద్వారా ఆన్ లైన్ నుంచి ఎమిరేట్స్ ఐడీ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఏ ప్రభుత్వ శాఖలు, గుర్తింపు కార్డుతో ముడిపడిన కార్యకలాపాలకు మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్న ఈ-ఎమిరేట్స్ ఐడీలను వినియోగించుకోవచ్చని ఐసీఏ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థలతో ఐసీఏ సమన్వయం చేస్తున్నట్లు తెలిపింది. అయితే..ఆన్ లైన్ ద్వారా గుర్తింపు కార్డులను పొందాలని అనుకుంటున్నవారు ముందుగా ఐసీఏ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.ఆ తర్వాత యాప్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా డాక్యుమెంట్ వాలెట్ లో ఐడీ సాఫ్ట్ కాపీని స్టోర్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com