త్రీ స్టెప్స్ లో ఈ-ఎమిరేట్స్ ఐడీ..వివరాలు వెల్లడించిన ఐసీఏ
- June 15, 2021
యూఏఈ: మీకు యూఏఈ గుర్తింపు కార్డు హార్డ్ కాపీ అందలేదా? ప్రింట్ కాపీ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే..ఇక నుంచి ఫిజికల్ గా ఎమిరేట్స్ ఐడీ కార్డు లేకున్నా చింతించాల్సిన అవసరం లేదు.ఈ-ఎమిరేట్స్ ఐడీ కార్డు సర్వీస్ తో అందరికీ ఎమిరేట్స్ గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఐసీఏ యాప్ ద్వారా ఆన్ లైన్ నుంచి ఎమిరేట్స్ ఐడీ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఏ ప్రభుత్వ శాఖలు, గుర్తింపు కార్డుతో ముడిపడిన కార్యకలాపాలకు మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్న ఈ-ఎమిరేట్స్ ఐడీలను వినియోగించుకోవచ్చని ఐసీఏ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థలతో ఐసీఏ సమన్వయం చేస్తున్నట్లు తెలిపింది. అయితే..ఆన్ లైన్ ద్వారా గుర్తింపు కార్డులను పొందాలని అనుకుంటున్నవారు ముందుగా ఐసీఏ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.ఆ తర్వాత యాప్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా డాక్యుమెంట్ వాలెట్ లో ఐడీ సాఫ్ట్ కాపీని స్టోర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







