కువైట్లో కొత్త వేరియంట్..ప్రవాసీయుల ఎంట్రీకి అనుమతి ఆలస్యం?

- June 16, 2021 , by Maagulf
కువైట్లో కొత్త వేరియంట్..ప్రవాసీయుల ఎంట్రీకి అనుమతి ఆలస్యం?

కువైట్లో కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ను గుర్తించారు. మ్యూటేషన్ అయిన వైరస్ 'డెల్టా' వేరియంట్ అని అధికారులు చెబుతున్నారు. ఈ మ్యూటేషన్ తో ప్రవాసీయుల ఎంట్రీకి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెలవులు, ఇతర పనుల మీద కువైట్ నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రవాసీయులు ట్రావెల్ బ్యాన్ అయా దేశాల్లోనే చిక్కుకుపోయారు. వైరస్ ఉద్ధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రవాసీయులను తిరిగి దేశంలోని అనుమతించేలా ఆంక్షలు ఎత్తివేస్తారనే సంకేతాలు కనిపించాయి. అయితే..డెల్టా వేరియంట్ గుర్తింపుతో ప్రవాసీయుల అనుమతి నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డెల్టా వేరియంట్ కు సంబంధించి కరోనా ఎమర్జెన్సీ కమిటీ ఇవాళ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. దీనిపై గురువారం నాటి మంత్రి మండలి సమావేశంలో చర్చించి ప్రవాసీయుల రాకపై ఆంక్షలు కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనేది నిర్ణయింనున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్ లు రాత్రి 11 గంటల వరకు ఒపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వటంపై కూడా రేపటి మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com