పిప్పన్ను సమస్యలకు వంట ఇంటి చిట్కా
- March 07, 2016సాదారణంగా చాల మందిలో పిప్పి పన్ను వల్ల కలిగే బాధ అంతాఇంతా కాదు. ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. తగ్గాలంటే పెయిన్ కిల్లర్ వాడాల్సిందే. వీటి వాడకం వల్ల ఉదర సంబంధమైన సమస్యలు, దీర్ఘ కాలం వాడితే కిడ్నీ సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలూ తప్పవు. వీలైనంత వరకూ పెయిన్ కిలర్లకు దూరంగా ఉండడం చాలా ఉత్తమమం, ఈ విషయం డాక్టర్లే చెబుతున్నారు. ఇతరత్రా నాటు వైద్యుల దగ్గర పళ్ల మీద ప్రయోగాలు చేస్తే మాత్రం ప్రమాదాలు తప్పవు.ఏ అర్ధరాత్రో, మందులు అందుబాటులో లేనిచోటో ఈ నొప్పి మొదలైతే తెల్ల వారిందాకా భరించాల్సిందే. అయితే మన ఇంట్లోనే దీనికి మంచి మందు ఉందని మనలో చాలా మందికి తెలియదు. శొంఠికొమ్ము, కల్లుప్పు మెత్తగా నూరి పన్నుకు ఏర్పడిన ఖాళీలో పెడితే క్షణాల్లో నొప్పి తగ్గడమే కాదు పన్నెండు గంటల్లో వాపుకూడా తగ్గుతుంది.పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇంత త్వరగా నొప్పిని తగ్గించలేదు. తరువాత సంబంధింత డాక్టరు వద్ద వైద్యం చేయించుకుని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడం ఉత్తమం.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్