ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బుకింగ్స్ నిలిపివేత
- June 19, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రైవేట్ ఆస్పత్రులు సినోఫార్మ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ ను నిలిపివేస్తున్నాయి. జూన్ మాసానికి సంబంధించి ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ పూర్తి
కావటంతో కొత్త బుకింగ్ తీసుకోవటం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అబుధాబిలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రులు వీపీఎస్, ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ లలో ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ స్లాట్స్ కు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నాయి. జూన్ నెలకు సంబంధించి ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ పూర్తి కావటంతో జులై నెలకు సంబంధించి స్లాట్ బుకింగ్స్ ను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు ఎన్ఎంసీ, మెడిక్లీనిక్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక వీపీఎస్ ఆస్పత్రిలో మాత్రం సినోఫార్మ్ ఫస్ట్ డోస్ స్లాట్ బుకింగ్స్ ను పూర్తిగా నిలిపివేసింది. ఇదిలాఉంటే అభుదాబి హెల్త్ సర్వీస్ కంపెనీ-సెహా మాత్రం తమ వైద్య కేంద్రాల్లో అన్ని డోసుల బుకింగ్స్ ను అహ్వానిస్తోంది. ఫైజర్, సినోఫార్మ్ వ్యాక్సిన్ కోసం సెహా మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!









