ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను అభినందించిన కల్వకుంట్ల కవిత
- June 19, 2021
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించింది. ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ని, నిక్కత్ జరీన్ తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎంతో కష్టపడి బాక్సింగ్ లో ప్రపంచస్థాయికి ఎదిగిన నిక్కత్ జరీన్, యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతేకాదు నిక్కత్ జరీన్ ను క్రీడలవైపు ప్రోత్సాహించిన తల్లిదండ్రులు పర్వీన్, జమీల్ లను సైతం ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,సాట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







