లాక్ డౌన్ నిబంధనలను మరింత సులభతరం చేసిన కర్నటక
- June 19, 2021
బెంగుళూరు: కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ క్రమంగా తీసివేస్తున్నాయి.కర్ణాటక కూడా లాక్ డౌన్ నిబంధనలను మరింత సులభతరం చేశాయి.కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ రూల్స్ వెసులుబాటు కల్పించారు. కొన్ని జిల్లాల్లో నిబంధనలు కొనసాగనున్నాయి.
16 జిల్లాల్లో సాయంత్రం 5 వరకు షాపులు తెరచి ఉంటాయి. ప్రజా రవాణా, బస్సులు, మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే అందులో 50 శాతం కేపాసిటీతో మాత్రం నడపాలని ప్రభుత్వం షరతు విధించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా 50 శాతం కేపాసిటీ నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు.
హోటల్స్, క్లబ్, రెసార్టెంట్లు తెరచేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే అందులో ఏసీ వేయొద్దు, మద్యం సరఫరా చేయొద్దని నిబంధన పెట్టారు. జిమ్ కూడా 50 శాతం మందితో.. ఏసీ ఆన్ చేయకుండా నడుపుకోవచ్చు. లాడ్జ్, రిసార్ట్ కూడా 50 శాతం కేపాసిటీతో రన్ చేయొచ్చు. స్టేడియాల్లో క్రీడలు నిర్వహించుకోవచ్చని.. కానీ నిబంధనలను బ్రేక్ చేయొద్దని స్పష్టంచేశారు.
నైట్ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుందని స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







