కువైట్: జూన్ 23న భారత ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- June 20, 2021
కువైట్ సిటీ: కువైట్‌లోని భారత ఎంబసీ ఈ నెల 23న(బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో భారత రాయబారి సిబీ జార్జీతో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇటీవల కువైట్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన, కమ్యూనిటీ సంక్షేమం పై రాయబారి మాట్లాడానున్నారు. జూన్ 9-11 తేదీల మధ్య జైశంకర్ కువైట్‌లో పర్యటించిన సందర్భంగా భారత సమాజానికి కలిగిన ప్రయోజనాలను వివరించనున్నారు.కువైట్‌లోని భారత ప్రవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రవాసులు తమ పాస్‌పోర్టులో ఉన్న విధంగా పూర్తి పేరు, పాస్‌పోర్ట్ నెంబర్, సివిల్ ఐడీ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, కువైట్‌లో నివాసం ఉంటున్న అడ్రస్ వివరాలతో రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ఐడీ [email protected]కు మెయిల్ చేయాలి. ఈ వర్చువల్ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లింక్: https://zoom.us/j/92084791973?pwd=RlBjc0tIa1I3OEg1bHRIakZrOEF2dz09
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ







