ఈ వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులకు అనుమతి - దుబాయ్

- June 20, 2021 , by Maagulf
ఈ వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులకు అనుమతి - దుబాయ్

దుబాయ్: భారత్ లోని డెల్టా వేరియంట్ సృష్టించిన మారణహోమానికి యావత్ ప్రపంచం అప్రమత్తమైంది. దాంతో ప్రపంచ దేశాలు భారత్ పై ట్రావెల్ బ్యాన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, వివిధ కారణాల చేత తమ దేశాలకు వెళ్ళిన ఎందరో ప్రవాసీయులు అక్కడే చిక్కుపోయారు. ఎందరో తమ కష్టాలను అటు భారత ప్రభుత్వానికి, ఇటు నివసిస్తున్న దేశ ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. అంతర్జాతీయ విమానాలపై జులై 6 వరకు బ్యాన్ విధించింది భారత్. గడువు పూర్తవుతుండడంతో ప్రవాసీయులలో ఆత్రుత నెలకొంది. నివాసితుల నుండి భారీగా అందుతున్న అభ్యర్థనల ఆధారంగా దుబాయ్ నేడు తాజా ప్రకటన విడుదల చేసింది.

అయితే, ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళను దుబాయ్ కు అనుమతించాలంటూ దుబాయ్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. 

యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు. ఈ మార్పులు జూన్ 23, 2021 నుండి అమల్లోకి వస్తాయి.

యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:
- ఫైజర్
- ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్
- సినోఫార్మ్
- స్పుత్నిక్

ప్రయాణీకులకు గమనిక:
* ప్రయాణికులందరూ బయలుదేరే ముందు 48 గంటల్లో తీసుకున్న నెగటివ్ కోవిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాలి.
* క్యూఆర్ కోడెడ్ పిసిఆర్ పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి.
* విమాన ప్రయాణానికి 4 గంటల ముందు ప్రయాణీకులందరూ రాపిడ్ పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులందరూ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులు తమ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని (ఇది 24 గంటల్లోపు అందుతుందని అంచనా) పొందే వరకు సంస్థాగత క్వారంటైన్ కు లోనవుతారు. యూఏఈ పౌరులు మరియు దౌత్యవేత్తలకు ఈ షరతుల నుండి మినహాయింపు కలదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com