శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం..
- June 21, 2021
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో భారీగా అక్రమ డ్రగ్స్ రవాణా గుట్టురట్టైంది. విదేశాల నుంచి యథేచ్చగా అక్రమ దందా నిర్వహిస్తున్న కేటుగాళ్లకు డీఆర్ఐ అధికారులు చెక్ పెట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టాంజానియా నుంచి వచ్చిన జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి దీన్ని మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఆరా తీస్తున్నారు. అతనికి హైదరాబాద్‌తో ఉన్న లింకులపై కూపీ లాగుతున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా పెరిగిందన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు.. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలోనే హైదరాబాద్, చెన్నై వంటి విమానాశ్రయాల్లో అప్పుడప్పుడు డ్రగ్స్ పట్టుబడుతూ వస్తోంది. జాన్ విలియమ్స్‌ను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన