3 ఏళ్లలో 9 చమురు బావులు, 8 ఆయిల్ రిజర్వాయర్లను కనుగొన్న కువైట్

- June 24, 2021 , by Maagulf
3 ఏళ్లలో 9 చమురు బావులు, 8 ఆయిల్ రిజర్వాయర్లను కనుగొన్న కువైట్

 కువైట్: చమురు అన్వేషణలో కువైట్ గత మూడేళ్లలో ఆశాజనక ఫలితాలను సాధించిందని కువైట్ స్పష్టం చేసింది. 2018 నుంచి మూడేళ్లలో 9 చమురు బావులు, 8 పెద్ద ఆయిల్ రిజర్వాయర్లను కనుగొన్నట్లు వెల్లడించింది. ఇందులో రెండు బావులను 2021 మార్చిలో అసెట్ మేనేజ్మెంట్ సెక్టార్ కి బదిలీ చేసినట్లు తెలిపింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 6 కొత్త బావులు యబ్బెత్ ఫీల్డ్ లో అల్-మనాకీష్, అల్-రావ్‌దైన్ ఫీల్డ్‌లోని హేత్ రిజర్వాయర్, కహ్లులా ఫీల్డ్‌లో దిగువ అల్-మరాత్, అల్-మరాత్ కషానియా, హోమాలో అల్-మరాత్, మరియు కబ్ద్ క్షేత్రంలో నజ్మా సర్జెలో కనుగొన్న విషయం తెలిసిందే. అయితే చమురు బావుల నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయిల్ ఉత్పత్తి దశకు చేరుకోవాలంటే నిర్దిష్ట ప్రమాణాలతో అనేక దశలను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com