ఇమ్యూన్ యాప్ గ్రీన్ మరియు ఆరెంజ్ స్టేటస్ వున్నవారికే ‘మాల్స్’లోకి ఎంట్రీ

- June 25, 2021 , by Maagulf
ఇమ్యూన్ యాప్ గ్రీన్ మరియు ఆరెంజ్ స్టేటస్ వున్నవారికే ‘మాల్స్’లోకి ఎంట్రీ

కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం మేరకు జూన్ 27 ఆదివారం నుంచి కమర్షియల్ మాల్స్, కేఫ్స్ అలాగే రెస్టారెంట్లలోకి వచ్చేవారికి ‘మై కువైటీ యాప్ ఐడీ’ లేదా ఇమ్యూన్ యాప్ ద్వారా మాత్రమే ప్రవేశం లభిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల్ని బట్టి, గ్రీన్ లేదా యెల్లో స్టేటస్ వున్నవారికే ప్రవేశం కల్పిస్తారు. రెండు డోసులు వ్ాయక్సిన్ పొందినవారికి గ్రీన్ కలర్ స్టేటస్ లభిస్తుంది. సింగిల్ డోస్ తీసుకున్న వారికి 14 రోజుల్లో ఆరెంజ్ స్టేటస్ లభిస్తుంది. గడచిన 90 రోజుల్లో కరోనా బారిన పడినవారికి యెల్లో కలర్ లభిస్తుంది. వ్యాక్సిన్ పొందనివారికి, ఇన్ఫెక్షన్ రానివారికి రెడ్ కలర్ లభిస్తుంది. వారికి పైన పేర్కొన్న ప్రాంతాల్లోకి ప్రవేశం కుదరదు. 16 ఏళ్ళ చిన్నారులు అలాగే మినిస్ట్రీ నుంచి ప్రత్యేకంగా అనుమతి పొందినవారికి ప్రవేశం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com