తెలంగాణ నుండి తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీ
- June 27, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది.రెండు రోజుల టూర్‌కు ఒక్కో వ్యక్తికి రూ.14,999 చార్జి చేయనున్నది. ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 6 గంటలకు విమానం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.అక్కడి నుంచి 8.45కు హోటల్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో తిరుమల స్వామివారి దర్శనం ఉంటుంది.దర్శనం పూర్తయ్యాక ఆకాశగంగ, పాపవినాశనం, జాపాలి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు మొదలైన ప్రదేశాల సైట్ సీయింగ్‌కు తీసుకువెళ్తారు. ప్రదేశాల సందర్శన సమయంలోనే మధ్యాహ్న భోజనం పెడతారు. అన్ని ప్రదేశాలు తిరిగాక రాత్రి 8 గంటలకు తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. 8.30కు రాత్రి భోజనం ఏర్పాటుచేస్తారు.రెండోరోజు ఉదయం 7 గంటల నుం చి 10.30 మధ్యలో కాణిపాకం, 11 నుంచి 12.30 మధ్యలో శ్రీనివాసమంగాపురం తీసుకెళ్తారు.మధ్యా హ్నం ఒంటి గంటకు హోటల్‌కు వచ్చి భోజనం చేసి 2.30 నుంచి 3.30 మధ్యలో పద్మావతి ఆలయం, 4 నుంచి 5 గంటల మధ్యలో శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చి రెండోరోజు రాత్రి 9.30కు హైదరాబాద్‌కు చేరుకొనేలా ప్యాకేజీని రూపొందించారు.ఈ మేరకు ట్రూజెట్, స్పైస్‌జెట్‌తో ఒప్పందం చేసుకున్నామని టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







