'ఇందువదన' హీరోయిన్ ఫస్ట్ లుక్

- June 27, 2021 , by Maagulf
\'ఇందువదన\' హీరోయిన్ ఫస్ట్ లుక్

హైదరాబాద్: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'ఇందువదన' చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది.బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ద్వారా వరుణ్ రీఎంట్రీ ఇస్తుండగా..ఫస్ట్‌లుక్‌తోనే ఇంప్రెషన్ కొట్టేశారు మేకర్స్. కాగా సినిమా పూర్తయిన సందర్భంగా వాసుగా వరుణ్‌ను.. ఇందుగా ఫర్నాజ్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ చిత్రంపై మరింత ఆసక్తి పెంచాయి.

సాంప్రదాయంగా కనిపిస్తూనే బోల్డ్‌ టచ్ ఉన్న ఈ పిక్చర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరిగినట్లు తెలిపింది మూవీ యూనిట్.కాగా ఈ చిత్రానికి కథ-మాటలు సతీశ్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూర్చారు.సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మరళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్యతలు తీసుకున్నారు.త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు మేకర్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com