వైద్యరంగానికి రూ.2 లక్షల కోట్ల నిధులు...
- July 01, 2021
న్యూ ఢిల్లీ: డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్యులు ముందు వరసలో ఉన్నారి, వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. వైద్యరంగం కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.
ఈ ఏడాది మార్చి నుంచి దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెద్దగా లేకున్నా, మార్చినుంచి ఒక్కసారిగా పెరిగాయి. అసుపత్రుల కొరత, అత్యవసర విభాగాల కొరత తీవ్రంగా కనిపించింది. అంతేకాదు, దేశంలో ఏప్రిల్, మే నెలలో ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది కరోనా రోగులు మృతిచెందారు. దీంతో దేశంలో ఆక్సీజన్, ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలను ప్రభుత్వాలు వేగంగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!