ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు..
- July 01, 2021
ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్(పీఎస్బీ) అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ (ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్) విభాగాల్లో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* గ్రౌండ్ డ్యూటీ (40), టెక్నికల్ విభాగంలో (10) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ 4 జులై నుంచి ప్రారంభమవుతుండగా 14 జులైన ముగియనుంది.
* పీఎస్బీ ప్రిలిమ్స్ పరీక్షను జులై 20న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఈ లింకు https://joinindiancoastguard.gov.in/ క్లిక్ చెయ్యండి
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!