‘ఎఫ్ 3’ షూటింగ్ పునః ప్రారంభం
- July 02, 2021
హైదరాబాద్: వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో తిరిగి మొదలు కావడం పట్ల యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ “2019లో సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఎఫ్ 2’ సినిమాకు ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ మూవీని చేస్తున్నాం. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెట్స్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో షూటింగ్ చేస్తున్నాం. వెంకటేశ్‌గారు, వరుణ్‌తేజ్, సునీల్ సహా మెయిన్ కాస్ట్ అండ్ క్రూ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ చిత్రాన్నితనదైన స్టైల్లో ‘ఎఫ్2’కి మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్నారు. మా బ్యానర్‌లో మరో నవ్వుల రైడ్ కన్‌ఫర్మ్’’ అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!