రోజువారి ప్రయాణికుల సంఖ్యను 5000 పెంచే దిశగా ప్లానింగ్స్
- July 03, 2021
కువైట్: రాబోయే రోజుల్లో తమ దేశానికి వచ్చే ప్రయాణికుల సామార్ధ్యాన్ని పెంచేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కువైట్ తెలిపింది. ప్రస్తుతం అరవైల్ ప్రయాణికుల సామర్ధ్యాన్ని 3,500 మందికి పరిమితం చేయగా..రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 5000కు పెంచనున్నట్లు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ప్లానింగ్ & ప్రాజెక్టు వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సాద్ అల్ ఒతైబి వెల్లడించారు. అదే సమయంలో యూరప్, అమెరికాలోని 12 గమ్యస్థానాలకు విమానాల రాకపోకలను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎయిర్ లైన్స్ వినతులు, మంత్రిమండలి ఆదేశాల మేరకు ఆయా దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు పౌర విమానయాన శాఖ తగిన ఏర్పాట్లలో ఉందన్నారు. కోవిడ్ రిస్క్ తక్కువగా ఉన్న దేశాలకు విమాన సర్వీసులను నడుపుకోవచ్చని మంత్రిమండలి ఆమోదించిన మేరకు ఆయా దేశాలకు వారానికి ఒక్క ఫ్లైట్ చొప్పున ఒక్కో ఎయిర్ లైన్స్ నుంచి ఒక్కో విమానానికి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. మంత్రివర్గ ఆదేశాల అమలు చేస్తూ తొలి రోజున జార్జియా ఓ విమాన సర్వీసును నడుపుతున్నామని..ఈ వారంలో లండన్, మాలాగా, సారాజేవోలకు మూడు విమాన సర్వీసులను షెడ్యూల్ చేసినట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







