డిజిటల్ పాస్ పోర్టును అందుబాటులోకి తెచ్చిన ఖతార్ ఎయిర్ వేస్

- July 03, 2021 , by Maagulf
డిజిటల్ పాస్ పోర్టును అందుబాటులోకి తెచ్చిన ఖతార్ ఎయిర్ వేస్

దోహా: నాణ్యమైన సేవలను అందించటంలో ఎప్పటికప్పుడు తమ విశిష్టతను చాటుకునే ఖతార్ ఎయిర్ లైన్స్..మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం డిజిటల్ పాస్ పోర్టు మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్ వ్యాక్సినేటెడ్ సర్టిఫికెట్, పీసీఆర్ టెస్టు వివరాలను ఈ డిజిటల్ పాస్ పోర్టు మొబైల్ యాప్ లో అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న తొలి ఎయిర్ లైన్స్ గా ఖతార్ ఎయిర్ లైన్స్ కావటం విశేషం. కోవిడ్ నేపథ్యంలో వీలైనంత వరకు పేపర్ వర్క్ ను తగ్గించటం, సాధ్యమైనంత మేర కాంటాక్ట్ లెస్ విధానాలను అవలంభించేందుకు డిజిటల్ పాస్ పోర్టు మొబైల్ యాప్ ద్వారా ప్రయోజనం చేకూరనున్నట్లు ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. డిజిటల్ పాస్ పోర్ట్ యాప్- IATA ట్రావెల్ పాస్ పనితీరు, ఖచ్చితత్వంపై ఎయిర్ లైన్స్ సిబ్బందితో ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. కువైట్, లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, పారిస్, సిడ్నీ నుంచి దోహాకు తమ సిబ్బంది డిజిటల్ పాస్ పోర్టు మొబైల్ యాప్ ద్వారా ప్రయాణించినట్లు వివరించారు. సిబ్బంది తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను, పాస్ పోర్టు వివరాలు, కోవిడ్ టెస్ట్ రిపోర్టులను మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ విజయవంతంగా ప్రయాణం కొనసాగించారని తెలిపారు. దీంతో ఇక ప్రయాణికులకు కూడా డిజిటల్ పాస్ పోర్ట్ యాప్- IATA ట్రావెల్ పాస్ ను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com