ఖతార్ లో తొలి ఇండియన్ వర్సిటీ, 4 కోర్సులతో అకాడమిక్ ఇయర్ షురూ
- July 06, 2021
దోహా: ఖతార్ లోని తొలి ఇండియన్ యూనివర్సిటీ వచ్చే సెప్టెంబర్ నుంచి తొలి అకాడమిక్ ఇయర్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.ఇండిస్ట్రియల్ రోడ్డు మార్గంలో బార్వా కమర్షియల్ అవెన్యూలో ఏర్పాటైన ఈ వర్సిటీ తొలుతగా నాలుగు అండర్ గ్రాడ్యూయేట్ స్టడీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులతో ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.దీనికి సంబంధించి జూన్ నుంచే అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ కానున్నాయి.ఇదిలా ఉంటే ఖతార్ లోని ఈ తొలి ఇండియన్ వర్సిటీ సావిత్రిభాయ్ పూలే పుణే యూనివర్సిటీ పర్యవక్షణ(SPPU)లో మైల్ స్టోన్ ఎడ్యూకేషన్(MIE) నిర్వహిస్తుండటం మరో విశేషం.వర్సిటీ ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియ కూడా SPPU ఆధ్వర్యంలోనే జరుగుతోంది.1949లో ప్రారంభమైన సావిత్రిభాయ్ పూలే యూనివర్సిటీ విద్యారంగంలో విశేష సేవలు అందిస్తోంది.ప్రస్తుతం 50 విభాగాల్లో విద్యాబోధన అందిస్తూ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా పేరుగాంచింది.ఇండియాలో టాప్ యూనివర్సిటీ లిస్టులో 17 స్థానం దక్కించుకుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







