కొవాక్సిన్ తీసుకున్నవాళ్ళు దుబాయ్ ఎప్పుడు రావచ్చు?

- July 07, 2021 , by Maagulf
కొవాక్సిన్ తీసుకున్నవాళ్ళు దుబాయ్ ఎప్పుడు రావచ్చు?

దుబాయ్: ఇండియాలో చిక్కుకుపోయిన ప్రవాసీయుల నుండి భారీగా అందుతున్న అభ్యర్థనల ఆధారంగా దుబాయ్ ప్రభుత్వం వీరిని ఇక్కడకు వచ్చేందుకు జులై 15, 2021 నుండి అనుమతిచ్చింది. అయితే, దీనిపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. భారత్ ఏవియేషన్ ఇంకా అనుమతి ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉంటే.. యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు అంటూ దుబాయ్ కొసమెరుపు పెట్టింది.

యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఇవి:
- ఫైజర్
- ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్
- సినోఫార్మ్
- స్పుత్నిక్
- మోడెర్నా 

కొవాక్సిన్ తీసుకున్నవారు పరిస్థితి ఏంటి?
భారత్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి ఆస్ట్రాజెనెకా ఫార్ములా ను ఉపయోగించి చేసిన కోవిషీల్డ్..మరోటి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ వారి కొవాక్సిన్. కోవిషీల్డ్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఉండటంతో ప్రపంచ దేశాలు కోవిషీల్డ్ వేసుకున్న వారిని తమ దేశాలకు అనుమతిస్తున్నాయి. అయితే, కొవాక్సిన్ కు మాత్రం ఇంకా WHO వారి ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఫేస్-3 ట్రయల్ డేటా ఆధారంగా WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) ను పొందడానికి వీలవుతుంది కనుక కొవాక్సిన్ ఫేస్-3 ట్రయల్ డేటాను విడుదల చేయడం ప్రాముఖ్యత కలిగి ఉంది.

తాజాగా విడుదలైన ఫేస్-3 ఫలితాలు:
తీవ్రమైన కేసులపై 93% ప్రభావవంతం
తేలికపాటి కేసులపై 77.7% ప్రభావవంతం 
డెల్టా వేరియంట్ పై 65.2% ప్రభావవంతం
అని తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు భారత్ బయోటెక్. కాబట్టి, ఈ ఫేస్-3 ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) ను పొందడానికి సాధ్యమైనంత త్వరగా పనులు వేగవంతం అవుతాయని భారత్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి డాక్టర్ వి.కె.పాల్ తెలిపారు.

ఇదిలా ఉంటే, విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం వెళ్లే వారు భారత్ ప్రభుత్వం పై సోషల్ మీడియా ద్వారా తమ అభ్యర్థనలను పంచుకుంటున్నారు.

కాబట్టి, కొవాక్సిన్ తీసుకున్నవారు ప్రయాణించాలంటే కొన్నిరోజులు వేచిఉండక తప్పదు!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com