వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, సంరక్షణ మరియు ముందు జాగ్రత్తలు

- July 07, 2021 , by Maagulf
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, సంరక్షణ మరియు ముందు జాగ్రత్తలు

రుతుపవనాలతో వర్షాలు కురుస్తాయి మరియు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఇది కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. నీరు నిలవ ఉండడం వలన దోమలకు అది ఒక మంచి ఆవాసంగా మారుతుంది. దానివలన మనం డెంగ్యూ, చికెన్‌ గున్యా మరియు మలేరియా కేసులను ఎక్కువగా చూస్తాము.

  • ఎక్కువ మంది రోగులు అధిక జ్వరాలు, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు మరియు రక్తంలో తక్కువ ప్లేట్‌లేట్ల సమస్యలతో వస్తారు.
  • వర్షపు నీరు బురదతో కలవడం వలన మనం త్రాగేనీరు కలుషితమైన కారణంగా మనకు విరేచనాలు మరియు వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అపరిశుభ్రమైన పరిస్థితి నెలకొనడం వలన రోగులు ఎక్కువగా విరేచనాలు మరియు ఫుడ్‌ పాయిజనింగ్‌తో బాధపడతారు.
  • ఉష్ణోగ్రత తగ్గిన కారణంగా అది జలుబు వైరస్‌లు బాగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది, తద్వారా ఎక్కువగా ఫ్లూ, న్యుమోనియా మరియు ఇన్‌ప్లూయెంజ కేసులు వస్తాయి.
  • అంతకుముందే అలెర్జీలు మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న రోగులలో వాతావరణంలో ఎక్కువ తేమ చేరిన కారణంగా వారిలో ఆస్తమా మరియు బ్రోంకైటీస్‌లు పెరుగుతాయి, వారిలో ఆకస్మికంగా శ్వాస మరియు ఉబ్బసం సమస్యలు సంభవిస్తాయి.
  • వ్యాయామం చేయలేక పోవడం మరియు ఉష్ణోగ్రత తగ్గడం కారణంగా గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తాయి. కీళ్ళు బిగుసుకుపోవడం  మరియు ఆర్థరైటిస్‌ సమస్యలు కూడా తలెత్తుతాయి. చిత్తడిగా మారిన నేల జారుతుండడం కారణంగా కిందపడి గాయాలు మరియు ఫ్రాక్చర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
  • అటువంటి సమస్యలను నివారించడానికి మనం చాలా సులభమైన ముందుజాగ్రత్తలను ఏలా తీసుకోవాలి.
  • మొదట మన ఇంట్లో మరియు చుట్టుపక్కల నీరు నిలిచి పోకుండా నివారించండి, దోమతెరలు మరియు మస్కిటో రిపెల్లంట్‌లను ఉపయోగించడం వలన డెంగ్యూ, చికెన్‌ గున్యా మరియు మలేరియా వంటి సమస్యలను నివారించవచ్చు. మునిసిపల్‌ సెంటర్‌ ద్వారా యాంటీ-మస్కిటో స్ప్రేలను కమ్యూనిటీ స్ప్రే చేయించాలి.
  • పరిశుభ్రంగా ఉండడం అనే అంశం తరువాత, వర్షంలో తడవకుండా ఉండడం మరియు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరియు ముఖ్యంగా వృద్దులకు ఫ్లూ టీకాలు వేయించడం వలన తరచుగా వారు ఫ్లూ మరియు జలుబు బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • డయేరియాను నివారించడానికి శుభ్రమైన నీరును తాగడం మరియు వెచ్చని ఆహారాన్ని  తీసుకోవడం మరొక ముఖ్యమైన అంశం. వడపోసిన నీరు తాగడం మంచిది. తరచుగా చేతులు కడుక్కోవడం కూడా మంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది.
  • ఉబ్బసం మరియు శ్వాస సమస్యలకు గురయ్యే వారు అదనపు జాగ్రత్తలను పాటించాలి మరియు అవసరమైతే రోగనిరోధక ఇన్హేలర్లను తీసుకోవాలి.
  • వృద్దులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకుని కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. బిగుసుకుపోయిన మరియు బాధాకరమైన కీళ్ళ సమస్య ఉంటే క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయాలి.
  • నేల తడిసి జారుడుగా ఉన్నట్లయితే వృద్ధులు పడిపోయి గాయపడే ప్రమాదం ఉన్నది, కావున వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

--డా.జె.అనీష్‌ ఆనంద్‌,కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌,

అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీ హిల్స్‌,హైదరాబాద్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com