కేంద్ర మంత్రుల రాజీనామా...
- July 07, 2021
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ సాయంత్రం జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆహ్వానం అందుకున్న నేతలందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
మరోవైపు కీలక నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. మరోపక్క, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. మొత్తం మీద ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
అనారోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్టు పోఖ్రియాల్ తెలిపారు.ఈనాటి కేబినెట్ విస్తరణలో పలువురికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.ఈ జాబితాలో కిషన్ రెడ్డి, కిరణ్ రిజుజు, అనురాగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరి, పురుషోత్తం రూపాల, మనుష్ మందవ్య ఉన్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







