భద్రత పరంగా ప్రపంచంలోనే యూఏఈకి రెండో స్థానం
- July 07, 2021
యూఏఈ: 2021 సంవత్సరానికిగాను మొత్తం 134 దేశాల్ని పరిగణనలోకి తీసుకుంటే, అత్యంత భద్రతతో కూడిన దేశాల్లో యూఏఈకి రెండో స్థానం లభించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది యూఏఈ. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన దేశం యూఏఈ. 64.3 శాతం యూఏఈ వాసులు పూర్తిగా వ్యాక్సినేషన్ పొందారు. యుద్ధం, శాంతి, వ్యక్తిగత భద్రత అలాగే ప్రకృతి విపత్తులు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని యూఏఈకి అత్యంత భద్రమైన దేశాల్లో రెండో స్థానం కల్పించారు. మొదటి స్థానం ఐర్లాండ్ దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, ఖతార్, సింగపూర్, ఫిన్లాండ్, మంగోలియా, నార్వే, డెన్మార్క్, కెనడా మరియు న్యూజిలాండ్ దేశాలున్నాయి. బహ్రెయిన్ 12వ స్థానంలో, కువైట్ 18వ స్థానంలో, సౌదీ అరేబియా 19వ స్థానంలో, ఒమన్ 25వ స్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







